కరోనా సెకండ్ వేవ్‌పై భయపడాల్సిన పనిలేదు

కరోనా సెకండ్ వేవ్‌పై భయపడాల్సిన పనిలేదు

దేశవ్యాప్తంగా గత నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మన తెలంగాణలో గత రెండు వారాల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్‌పై భయాందోళన అవసరం లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే వ్యాక్సినే వేసుకుంటే మాత్రం కరోనా వచ్చే అవకాశాలు తక్కువ అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటికి పైగా కోవిడ్ టెస్టులు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదకొండున్నర లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మాస్కే మనకు శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు. 60 ఏళ్లు పైబడిన వారందరూ సామూహిక పండుగలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ చాలా తక్కువగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.