కౌడిపల్లి, వెలుగు : వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ డీఎంహెచ్వో చందూనాయక్ సూచించారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో డాక్టర్లు ఫీల్డ్ సర్వే చేస్తున్న సందర్భంలో ఆయన తనిఖీ చేశారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే మందులు, కిట్స్అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు మండలానికి రూ. 1.79 లక్షల మందులు వస్తే 90 శాతం రోగులకు మందులు పంపిణీ చేశామన్నారు. స్థానిక మురుగు కాల్వను చూసి వెంటనే క్లీన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎం హెచ్వో విజయలక్ష్మి, పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్, ఎంపీహెచ్ఈవో మల్లికార్జున్, రాధా కిషన్, సూపర్వైజర్లు శ్రీధర్ రెడ్డి, రమేశ్, ఏఎన్ఎం చిన్నమ్మ,
సుమిత్ర ఉన్నారు.