స్టాలిన్‌‌‌‌‌‌‌‌ దూకుడు.. సింగిల్ గానే పూర్తి మెజారిటీ

స్టాలిన్‌‌‌‌‌‌‌‌ దూకుడు.. సింగిల్ గానే పూర్తి మెజారిటీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ సత్తా చాటింది. పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది. 234 స్థానాలకు గాను మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ 118ను దాటి 126 స్థానాలు కైవసం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిపి 160 సీట్లు గెలుచుకుంది. డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 18 స్థానాల్లో గెలవగా.. విదుతలై చిరుతైగల్‌‌‌‌‌‌‌‌ కచ్చి 4, రెండు లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ పార్టీలు కలిసి 4, మిగతా పార్టీలు 8 స్థానాలు కైవసం చేసుకున్నాయి. పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌, సీఎం క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ స్టాలిన్‌‌‌‌‌‌‌‌ కొలత్తూరు నుంచి మూడోసారి గెలిచారు. స్టాలిన్‌‌‌‌‌‌‌‌ కొడుకు ఉదయనిధి స్టాలిన్‌‌‌‌‌‌‌‌ చెపాక్‌‌‌‌‌‌‌‌ నుంచి తొలిసారి గెలుపొందారు.

సీఎం పళనిస్వామి విన్‌‌‌‌‌‌‌‌

అధికార అన్నా డీఎంకే 64 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిసి 74 సీట్లను కైవసం చేసుకుంది. అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్న పట్టై మక్కల్‌‌‌‌‌‌‌‌ కచ్చి 5, బీజేపీ 4, మరో పార్టీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. సేలమ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని ఎడప్పాటి నుంచి పోటీ చేసిన సీఎం కే పళనిస్వామి తన ప్రత్యర్థి.. డీఎంకే క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ సంపత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌పై గెలుపొందారు. బొడినాయకనుర్‌‌‌‌‌‌‌‌ నుంచి బరిలో దిగిన డిప్యూటీ సీఎం పనీర్‌‌‌‌‌‌‌‌సెల్వం విజయం సాధించారు. చాలా ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌ డీఎంకే భారీ విజయం సాధిస్తుందని, 200 సీట్లకు పైగా గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ ఏఐఏడీఎంకే గట్టి పోటీ ఇచ్చింది. యాక్టర్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌హాసన్‌‌‌‌‌‌‌‌ స్థాపించిన మక్కల్‌‌‌‌‌‌‌‌ నీది మయ్యం (ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఎం) ప్రభావం చూపించలేకపోయింది. సౌత్‌‌‌‌‌‌‌‌ కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌ నుంచి బరిలో దిగిన కమల్‌‌‌‌‌‌‌‌ ఓడిపోయారు. థౌజండ్‌‌‌‌‌‌‌‌ లైట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ చేసిన బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌, నటి ఖుష్బూ డీఎంకే క్యాడిండేట్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోయారు.  

ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాం: స్టాలిన్‌‌‌‌‌‌‌‌

డీఎంకేకు అధికారమిచ్చిన తమిళనాడు ప్రజలకు పార్టీ అధినేత స్టాలిన్‌‌‌‌‌‌‌‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేస్తామన్నారు. ‘డీఎంకే అధికారంలో ఉంటే తమకు సంక్షేమ ఫలాలు అందుతాయని జనం గుర్తించారు. అందుకే ఈ భారీ విజయాన్ని కట్టబెట్టారు’ అని స్టాలిన్ అన్నారు.

స్టాలిన్‌‌‌‌‌‌‌‌ ప్రస్థానం

స్టాలిన్‌‌‌‌‌‌‌‌ తొలిసారి 1984లో చెన్నైలోని థౌజండ్‌‌‌‌‌‌‌‌ లైట్స్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అన్నాడీఎంకే క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ కేఏ కృష్ణస్వామి చేతిలో ఓడిపోయారు. అదే సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి 1989లో గెలిచారు. 1991లో డీఎంకే సర్కారును కేంద్రంలోని చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ సర్కారు బర్తరఫ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఎన్నికలు వచ్చాయి. దీంతో 1991 ఎన్నికల్లో థౌజండ్‌‌‌‌‌‌‌‌ లైట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ చేసి మళ్లీ కృష్ణస్వామి చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి 2011 వరకు థౌజండ్‌‌‌‌‌‌‌‌ లైట్స్‌‌‌‌‌‌‌‌లో గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత కొలత్తూరు తొలి ఎమ్మెల్యేగా 2011 ఎన్నికల్లో విజయం సాధించారు. 2016లో మళ్లీ అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. మొత్తంగా థౌజండ్‌‌‌‌‌‌‌‌ లైట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి నాలుగు సార్లు, కొళత్తూరు నుంచి మూడు సార్లు విజయం సాధించారు.