
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ మాజీ నేత వట్టె జానయ్యను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తనపై ఒకే సారి రాష్ట్ర పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ.. వట్టె జానయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన బెంచ్ విచారించింది. రాజకీయ ప్రతీకారంలో భాగంగా జానయ్యపై దాదాపు 50 కేసులు నమోదు చేశారని ఆయన తరఫు అడ్వకేట్ వాదించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లు కోర్టుకు నివేదించా రు. ఇందులో ఒక పిటిషన్ పై విచారణ జరిపిన బెంచ్.. ఈ నెల 22న జానయ్యకు అరెస్ట్ నుంచి ఊరట కల్పించిందన్నారు.