ఉస్మానియా కొత్త దవాఖాన కోసం మా ఇండ్లు కూల్చొద్దు.. రోడ్డెక్కిన బాలయ్య బాడ బస్తీ వాసులు

ఉస్మానియా కొత్త దవాఖాన కోసం మా ఇండ్లు కూల్చొద్దు.. రోడ్డెక్కిన బాలయ్య బాడ బస్తీ వాసులు

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉస్మానియా దవాఖాన కొత్త భవన నిర్మాణానికి వ్యతిరేకంగా బాలయ్య బాడ బస్తీకి చెందిన స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం సుమారు 50 ఇండ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు వంద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

తాము వందేండ్లుగా నివసిస్తున్న ఇండ్లను కూల్చవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ఈ చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి  జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్​కు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.