మా భూముల నుంచి కాల్వలు తవ్వొద్దు : నందిగామ రైతులు

మా భూముల నుంచి కాల్వలు తవ్వొద్దు : నందిగామ రైతులు
  • తహసీల్దార్​కు స్పష్టం చేసిన మెదక్ ​జిల్లా నందిగామ రైతులు

మెదక్,( నిజాంపేట ), వెలుగు : కాళేశ్వరం కాల్వల వల్ల తమకు ఉపయోగం లేదని, అందువల్ల తమ భూములు తీసుకొని కాల్వలు తవ్వాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నందిగామ రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 13 కింద చేపట్టనున్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్ – 8ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ ​ప్రభాకర్ మంగళవారం నందిగామ గ్రామ పంచాయతీ వద్ద గ్రామసభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కాల్వ నిర్మాణం కోసం గ్రామానికి చెందిన 40 మంది రైతులకు సంబంధించి 12 ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. అయితే, రైతులు మాత్రం తమ భూముల నుంచి కాల్వ పనులు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ కాల్వ ద్వారా తమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తర్వాత తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు. సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్, విలేజ్ సెక్రటరీ ఆరిఫ్ హుస్సేన్, రైతులు ప్రభాకర్, రాజు, నర్సారెడ్డి, రాంచంద్రం ఉన్నారు.