చెత్త సేకరణకు డబ్బులు తీసుకోవద్దు.. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నేతలు వినతి

చెత్త సేకరణకు డబ్బులు తీసుకోవద్దు.. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నేతలు వినతి

శంషాబాద్, వెలుగు: చెత్త సేకరణ కోసం డబ్బులు వసూలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. సోమవారం కొనమల దేవేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు శంషాబాద్ మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ సుమన్ రావుకు వినతిపత్రం అందజేశారు. 

చేత్త సేకరణ కోసం కేంద్రం స్వచ్ఛభారత్ పథకాన్ని  ప్రవేశపెట్టి మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తోందన్నారు. కానీ మున్సిపల్ పాలకవర్గం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. చెత్త సేకరణకు నెలకు రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వసూళ్లు ఆపాలని కోరారు. కార్యక్రమంలో వంశీ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, మెట్టు రమేశ్, అమరేందర్ రెడ్డి, స్వామి, మైపాల్ పాల్గొన్నారు.