- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్ మ్యాచ్‌లు నిర్వహించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ రిలీజ్చేసిన ప్రకటన ఆధారంగా ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు.
పిటిషనర్ తరఫు అడ్వొకేట్వాదిస్తూ.. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్‌లు నిర్వహించాలని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ జులై 2న రిలీజ్చేసిన ప్రకటన అంబుడ్స్‌మెన్ జూన్ 14న ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకమన్నారు. టీం ఎంపిక నిమిత్తం ప్లేఆఫ్స్ నిర్వహించాకే లీగ్‌లు నిర్వహించాలన్నారు. వాదనల తర్వాత లీగ్ మ్యాచ్‌లను నిర్వహించొద్దని హెచ్‌సీఏకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
