నాపై కక్ష సాధించడం సరికాదు.. ఎవరి మాటలపై స్పందించను

నాపై కక్ష సాధించడం సరికాదు.. ఎవరి మాటలపై స్పందించను

హుజురాబాద్: ఎవరూ చరిత్ర ఏంటో  ప్రజలకు తెలుసన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. ఎవరి మాటలు వినో కేసీఆర్ నాపై కక్ష కడుతున్నారన్నారు. టీఆర్ఎస్ లో మంత్రులకు గౌరవం దక్కడం లేదన్నారు.  హుజురాబాద్ లో ఈటల మీడియాతో మాట్లాడుతూ .. ఎవరి గురించి కామెంట్ చేయను అన్నారు. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ కి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదని.. స్వాగతించానన్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదని.. కేసీఆర్ గారి తర్వాత ఆయన కొడుకునే సీఎం కావాలని అన్నాను. బయట ఎవరో నేను సీఎం అవుతానని అన్నందుకు నేను చేసింది తప్పా అన్నారు.

ఇందుకోసమే నాపై కక్ష సాధించడం సరికాదని.. ఎవరి మాటలపై స్పందించను అన్నారు. నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు. సీఎం అహంకారంపై మంత్రులే మాట్లాడారు. సీఎం‌కు ఇంత అహంకారం ఉంటదా అని వారే అన్నారు అని తెలిపారు ఈటల రాజేందర్.  నేనే అన్ని పార్టీల నేతలతో కలివిడిగా ఉంటానన్న ఈటల.. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల నాయకులు కలుస్తారు కానీ.. ఇప్పుడు కలిస్తే పార్టీ మారుతున్నారా అని హింసించడం జరుగుతుందన్నారు.  కాంగ్రెస్ తో మాట్లాడితే నేరం.. బీజేపీతో మాట్లాడితే తప్పు అనడం టీఆర్ఎస్ లొనే ఉందన్నారు. గతంలో సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని జమ్మికుంటకు నీళ్లు కావాలని చెప్పడం కోసం కలవడానికి వెళ్లినా అని గుర్తు చేశారు ఈటల రాజేందర్.