
హిందువులు మహిళలను మహాలక్ష్మీగా భావించే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు9న వచ్చింది. అలాంటి అక్కాచెల్లెళ్లు .. అన్నా తమ్ముళ్లకు.. శ్రావణమాసం పౌర్ణమి రోజున రాఖీ కట్టడం సంప్రదాయంగా వస్తుంటారు. అలానే సోదరులు.. సోదరీమణులకు బహుమతులు ఇస్తుంటారు. కాని జ్యోతిష్యం ప్రకారం .. కొన్ని రకాల గిఫ్ట్స్ ఇస్తే మీ సంబంధాలలో గ్యాప్ పెరిగే అవకాశం ఉందంటున్నారు పండితులు. ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. . .
గాజు సామాను: రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరికి గాజుతో తయారు చేసిన వస్తువులు ఎప్పటికీ బహుమతిగా ఇవ్వకూడదు. అలాంటివి బహుమతిగా ఇచ్చినప్పుడు కిందపడితే పగిలిపోతాయి. ఇలా బహుమతులు బ్రేక్ అవడం అశుభమని భావిస్తారు. గాజు ఎలా బ్రేక్ అయిందో... మీ రిలేషన్ కూడా బ్రేక్ అవుతుందని నమ్ముతారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గాజుతో తయారు చేసిన సామానులను రాఖీ పండుగ రోజు మీ ఇంటి ఆడపడుచులకు బహుమతిగా ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు.
పెర్ ఫ్యూమ్స్ : సోదరి... సోదరుల మధ్య సంబంధాలు జీవితాంత కాలం మంచిగా ఉండాలి. పెర్ ఫ్యూమ్స్ వాసన ఒక్కోటి ఒక్కోరకంగా ఉంటుంది. కొంతమంది అసలు వాడరు కూడా. మీరు ఇచ్చే పెర్ ఫ్యూమ్స్ వాడాలని కూడా లేదు. వాటి స్మెల్ ప్రతికూల శక్తినికి కలిగిఉంటుంది... ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా పెర్ ఫ్యూమ్స్ వలన ఉపయోగాలు కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అందుకే పెర్ఫ్యూమ్స్ ను ఎట్టి పరిస్థితిలో రాఖీ పండుగ రోజు బహుమతిగా ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు.
స్మార్ట్‌వాచ్ (గడియారం):రాఖీ పండుగ వేళ చాలా మంది తమ సోదరీమణులకు సమయం విలువ తెలియాలని, అది ఉంటే తమను కలకాలం గుర్తు పెట్టుకుంటారని భావించి గడియారాలను బహుమతిగా ఇస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం స్మార్ట్ వాచెస్ లో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో చాలా మంది వీటిని ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం, గడియారం ఆగిపోతే మీ బంధంపై ప్రభావం పడుతుందట. కాబట్టి మీ సోదరీమణులకు వాచ్ లేదా స్మార్ట్ వాచెస్ వంటి వాటిని ఇవ్వకండి.
నలుపు రంగువస్తువులు: హిందూ మత విశ్వాసాల ప్రకారం, నలుపు రంగును అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ రంగుపై శని దేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రస్సులను అస్సలు ఇవ్వొద్దు.. అందుకే తమ సోదరి భవిష్యత్తు మేలు కోరుకునే సోదరులంతా నలుపు రంగులో ఉండే ఎలాంటి వస్తువులను రాఖీ పండుగ రోజున బహుమతిగా ఇవ్వకండి. ఇంకా రాఖీ పండుగ వంటి పవిత్రమైన రోజున మీ తోబుట్టువులకు పాదరక్షలను బహుమతిగా ఇవ్వకూడదు.