ధోనిని తక్కువ అంచనా వేయకండి: మైకేల్‌ క్లార్క్‌

ధోనిని తక్కువ అంచనా వేయకండి: మైకేల్‌ క్లార్క్‌

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని భారత జట్టులో కొనసాగడంపై పలువురు విమర్శలు చేయగా.. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ స్పందించారు. ధోనీపై విమర్శలు చేసి అతని ఖ్యాతిని తగ్గించడం మంచిదికాదన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి అవసరం చాలా ఉందన్నారు. త్వరలోనే వన్డే వరల్డ్‌కప్‌ ప్రారంభం కానుందని.. ధోని ప్రాధాన్యతను తక్కువ చేస్తూ విమర్శలు చేయడం సరైంది కాదన్నారు మైకేల్. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లలో ఆయన అనుభవం అత్యంత కీలకమన్నారు. భారత్‌కు రెండు సార్లు వరల్డ్‌కప్‌ సాధించిన ఘనత అతనిదేనని ధోని ఆటను ప్రశంసించారు. 2007,2011లో జరిగిన T-20 వరల్డ్‌కప్‌లో ధోని కెప్టెన్సీలోనే భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచిందని గుర్తు చేశారు మైకేల్‌ క్లార్క్‌.