ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. అయితే అప్డేట్ చేసుకోండి

ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. అయితే అప్డేట్ చేసుకోండి

ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావడంతో పాత బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వారు తమ అకౌంట్ అప్డేట్ చేసుకోవాల్సిన గడువు దగ్గరపడుతోంది. అకౌంట్ నెంబరు ఏమాత్రం మారదు. కాకపోతే.. ఐఎఫ్ఎస్సీ కోడ్ మాత్రమే మారిపోతుంది. అలాగే పాత చెక్ బుక్ ఉంటే వెనక్కు ఇచ్చి కొత్త చెక్ బుక్ తీసుకోవాల్సిన టైం దగ్గరపడుతోంది. ఏటీఎం డెబిట్ కార్డు కూడా గడువు వరకు పనిచేస్తుంది. పాస్ వర్డ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏయే బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారు.. ఎంతలోపు తమ అకౌంట్లను అప్డేట్ చేసుకోవాలో ఒకసారి గుర్తు పెట్టుకుంటే మంచిది. ఇప్పటికే బ్యాంకుల్లో లవాదేవీల రద్దీ పెరగుతుండడంతో గడువుకు కాస్త ముందుగానే అప్డేట్ చేసుకుంటే బెటర్ అంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు.

ఆంధ్రాబ్యాంకు

కార్పొరేషన్ బ్యాంక్

ఈ రెండు బ్యాంకులు యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాంకుల బ్రాంచీలు, ఏటీఎం కేంద్రాల వద్ద బోర్డులు మార్చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ పాత బోర్డులు ఉన్నా.. కస్టమర్లలో గందరగోళం నివారించడం కోసమే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఈ  బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వారికి వారి అకౌంట్ నెంబర్లు ఏ మాత్రం మారవు. అలాగే నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లు కూడా మార్చాల్సిన అవసరం లేదు.  అయితే నెట్ బ్యాంకింగ్ వారు మార్చి 31 వరకు పాత  ఐఎఫ్ఎస్సీ కోడ్ పనిచేస్తుంది. మార్చి 31 తర్వాత కొత్త  ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌వస్తుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త కోడ్స్, చెక్ బుక్కులు‌ అమల్లోకి వస్తాయి.

దేనా బ్యాంకు

విజయా బ్యాంకు

ఈ రెండు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన విషయం తెలిసిందే. అకౌంట్ నెంబర్లు, డెబిట్ కార్డుల పాస్ వర్డులు… లాగిన్ ఐడీలు మారవు. అయితే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మాత్రమే మారిపోతుంది.మార్చి 1 నుంచే కొత్త కోడ్ అమలులోకి వస్తుంది కాబట్టి ఈలోపు కొత్త కోడ్ ను తెలుసుకుని ఉండడం బెటర్.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌

ఈ రెండు బ్యాంకులు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లో విలీనమైన విషయం తెలిందే. బ్యాంకు అకౌంట్ నెంబర్లు, డెబిట్ కార్డుల పాస్ వర్డులు ఏమీ మారవు. అయితే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మాత్రమే మారిపోతుంది. పాత చెక్ బుక్కులు కూడా మార్చి 31 తర్వాత పనిచేయవు.  ఏప్రిల్ 1 నుండి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ అమలులోకి వస్తుంది.  ఈలోపు చెక్ బుక్కులు మార్చుకోవడంతోపాటు.. ఐఎఫ్ఎస్సీ కోడ్ తెలుసుకుంటే మంచిది.

 

For More News..

అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాలు సరిగా అమలు చెయ్యాలి

మంత్రి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషనర్ ఆదేశం

వీడియో: అది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్.. పరిగెత్తుకెళ్లి లారీ కిందపడిన వ్యక్తి

యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి