కార్తీక మాసం: కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?

కార్తీక మాసం: కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?

Karthika Pournami 2023: కార్తీకమాసంలో పూజలు.. నదీ స్నానాలకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.  నదీ తీరానికి దగ్గరలో ఉండే వారు నెల రోజులు రోజూ చేస్తుంటారు.  అలా కుదరని రాని వారు సోమవారాలు...ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో గంగానది గాని.. లేక అందుబాటులో ఉన్న నదుల్లో కాని స్నానం చేస్తారు .  అయితే ఈ ఏడాది (2023) పౌర్ణమి, సోమవారం ఒకే రోజు వచ్చాయి.  ఇలా పుణ్యస్నానం చేయడం వలన ఎంతో పుణ్యఫలం వస్తుందని పండితులు  చెబుతున్నారు, గంగాస్నానం చేయడం వల్ల ఎఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కార్తీక పౌర్ణమిని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు. ఈ రోజున చాలా మంది నదుల్లో  పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సనాతన ధర్మంలో దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసం విష్ణుమూర్తికి,శివుడి ఆరాధనకు అంకితం చేయబడింది.  ఈ ఏడాది (2023) కార్తీక పౌర్ణమి, సోమవారం  కలసి వచ్చాయి.  


 కార్తీక పౌర్ణమిని పవిత్రమైన పండుగగా భావించి...   దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. . ఈ రోజున ( నవంబర్​ 27)  కొంతమంది ఖచ్చితంగా గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సనాతన ధర్మంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తారు. ఇక  కార్తీక పౌర్ణమిరోజున దేవాలయాల్లో 365 వత్తులు వెలిగిస్తారు.   ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ,  సోమవారం నవంబర్ 27న వచ్చింది. 

గంగా స్నానం ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో గంగానది స్నానానికి ఎంతో ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ( నవండర్​ 27)  భక్తులు గంగానదిలో స్నానమాచరిస్తారు. విష్ణుమూర్తిని పూజిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి గంగానదిలో స్నానమాచరిస్తుంటారు. హరిద్వార్, రిషికేష్, వారణాసి, నాసిక్, కురుక్షేత్ర, పుష్కర తదితర ప్రదేశాలనుసందర్శించే పవిత్ర దినాలలో కార్తీక పౌర్ణమి ఒకటి.

ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి (నవంబర్​ 27)  నాడు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన వారికి గతంలో జరిగిన చెడంతా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.  కష్టనష్టాల నుంచి బయటపడతారని నమ్ముతారు. అంతేకాదు భక్తుల సకల బాధలు తొలగిపోతాయని విశ్వాసం. దీనితో పాటుగా ఈ ప్రత్యేకమైన రోజున గంగా నది దగ్గర దీపాన్ని వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. 

 గంగా స్నానం పూజా విధి

  • కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించాలి.
     
  • గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వీళ్లేకపోతే ఈ పవిత్రమైన రోజున మీ స్నానపు నీటిలో గంగా నీటిని కలపండి.
     
  • ఈ రోజున సూర్యభగవానుని పూజించడం కూడా ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు. 
     
  • సూర్య భగవానునికి అర్ఘ్యం చేసేటప్పుడు 'ఓం ఆదిత్యాయ నమః' అని జపించండి. దీంతో మీరు ఆయన అనుగ్రహం పొందుతారు. 
     
  • సాయంత్రం పూట గంగానదిలో స్నానం చేసే భక్తులు చంద్ర దేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. 
     
  • ఈ రోజున గంగామాత ముందు కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగించండి. వీలైతే 7 దేశీ నెయ్యి దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు