నేను రాజీనామా చేయాలనుకుంటున్నారా.. తోలు తీస్తా

నేను రాజీనామా చేయాలనుకుంటున్నారా.. తోలు తీస్తా

హైదరాబాద్: తాను రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. పార్టీ ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ భవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో .. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రచారంపై ఘాటుగా స్పందించారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. సమావేశంలో.. ఇంకో సారి ఆయన సీఎం , ఈయన సీఎం అంటే పార్టీ నుంచి పీకేస్తామని హెచ్చరించారు. సీఎం గురించి మాట్లాడితే తోలు తీస్తానని అన్నారు.

‘నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా..’ అంటూ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. ఎవరైనా ఇంకో సారి సీఎం గురించి మాట్లాడితే కాళ్ళు పట్టుకొని బండకేసి కొడతానని, కర్రు కాల్చి వాత పెడతానని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.

కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే ల ఆధిపత్యం ఎక్కువైందన్న సీఎం… కింద వున్న టీం అంతా మన పార్టీవారేనని.. వాళ్ళందరిని గౌరవించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు గెలవాలంటే కింది స్థాయి వాళ్ళు పనిచేయాలని అన్నారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రం తో మాట్లాదాల్సి వుంటుందని ఎమ్మెల్యేలకు సూచించారు. సోషల్ మీడియా లో యాక్టి వ్ గా ఉండాలంటూ.. విపక్షాలకు కౌంటర్ లు ఇవ్వాలంటూ సీఎం వారికి సూచించారు.