
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి చివరి ఫోన్ కాల్ తన సోదరితో మాట్లాడింది. నవాబు పేట మండలం కొల్లూరు వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక బుధవారం డ్యూటీకి వెళ్లి వస్తుండగా షాద్ నగర్ సమీపంలోని హైవేపై తన స్కూటీ పాడైందని తన సోదరితో ఫోన్ లో చెప్పింది. తన స్కూటీని ఎవరో రిపేర్ చేయిస్తామని చెప్పి ఓ చిన్నబ్బాయికి ఇచ్చి పంపించారని చెప్పింది. తర్వాత ఎవరూ స్కూటీ తీసుకరాలేదని ఇక్కడ లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు చాలా భయంగా ఉందని పదే పదే ఏడుస్తూ సోదరితో చెప్పింది ప్రియాంక. అయితే బైక్ వదిలేసి అక్కడి నుంచి రమ్మని ప్రియాంకతో చెప్పింది తన సోదరి. భయపడొద్దని ధైర్యం చెప్పింది కానీ అక్కడి నుంచి తిరిగి రాలేదు ప్రియాంక. గురువారం తెల్లవారేలోగా దారుణంగా హత్యకు గురైంది ప్రియాంక.