సంగారెడ్డి జిల్లా బొల్లారంలో కారు బీభత్సం సృష్టించింది. తోపుడుబండ్ల మీదకి దూసుకెళ్లింది కారు. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కారు వెంటపడి అతడిని పట్టుకున్నారు. ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న కార్తిక్ ఎల్లంకి కారుగా గుర్తించారు పోలీసులు. తన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తానని గాయపడ్డ పాషాను తీసుకువెళ్లాడు డాక్టర్ కార్తిక్.
అయితే అత్తాపూర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో పాషాను పెట్టి పరారయ్యాడు డాక్టర్ కార్తీక్. పాషా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆస్పత్రి బిల్లులు కట్టలేక పాషా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. స్థానికులు డాక్టర్ ను పట్టించి పోలీసులకు అప్పగిస్తే వదిలేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
