ప్రపంచాన్ని భయపెట్టే మహమ్మారి అనుకోలేదు

ప్రపంచాన్ని భయపెట్టే మహమ్మారి అనుకోలేదు
  • సాధారణ అంటువ్యాధేనని భావించా
  • కరోనా ఫస్ట్ కేసులను గుర్తించిన డాక్టర్ జంగ్
  • ఆనాటి అనుభవాలను షేర్ చేసుకున్న డాక్టర్

వుహాన్ : కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాలు దీని బారిన పడి ఆగమాగం అవుతున్నాయి. ఐతే దీని ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందని అస్సలు ఊహించలేదని కరోనా ఫస్ట్ కేసును గుర్తించిన చైనాకు చెందిన లేడీ డాక్టర్ జంగ్ తెలిపారు. వుహాన్ ఫ్రావిన్స్ లో ఓ వృద్ధ దంపతులకు కరోనా సోకినట్లు ఫస్ట్ గుర్తించిందే డాక్టర్ జంగ్. ఇదేదో సాధారణ అంటువ్యాధి అనుకున్నానని ఇంతటి మహమ్మరిగా మారి ప్రపంచాన్ని పరేషాన్ చేస్తుందని అనుకోలేదన్నారు. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 లక్షలకు చేరాయి. ఇప్పటికే 1, 50, 000 మందికి పైగా చనిపోయారు. దీని ఎఫెక్ట్ తో సగం ప్రపంచం లాక్ డౌన్ లో ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ జంగ్ తను ఫస్ట్ కేసును ఎలా గుర్తించానన్నది శుక్రవారం ఓ న్యూస్ ఏజెన్సీ ద్వారా మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు.

లంగ్స్ లో సమస్యలతో అనుమానించా
డాక్టర్ జంగ్ హుబే ప్రొవెన్షియల్ హాస్పిటల్ లో శ్వాసకోస వ్యాధుల ఎక్స్ ఫర్ట్. గతేడాది డిసెంబర్ 26 న హాస్పిటల్ కు వచ్చిన కరోనా అనుమానిత లక్షణాలున్న వృద్ధ దంపతులను ఆమె గుర్తించారు. ” ఆ రోజు మా హాస్పిటల్ కు వచ్చిన వచ్చిన జ్వరం, దగ్గు, నీరసంతో వృద్ధ దంపతులు వచ్చారు. ఫ్లూ లక్షణాలే కావటంతో సాధారణంగానే భావించా. కానీ వారికి సిటి స్కాన్ తీశాం. రిపోర్ట్ లో లంగ్స్ దెబ్బతినట్లు తేలటంతో ఇది ఫ్లూ కాదని అనుమానించాను ” అని ఆమె చెప్పారు. ప్లూ వైరస్ కు దీనికి చాలా తేడాలున్నట్లు గ్రహించాను. ఇదేదో అంటు వ్యాధి అని భావించి వారి కుమారునికి కూడా సిటి స్కాన్ తీయాలని భావించామని చెప్పారు. ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు లేకపోవటంతో వారి కుమారుడు సిటిస్కాన్ స్కాన్ ఒప్పుకోలేదని ఐతే అతనికి పరిస్థితి వివరించి స్కాన్ చేయగా అతని తల్లితండ్రుల లంగ్స్ లో మాదిరిగానే రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అదే లక్షణాలతో మరుసటి రోజు ఇంకో వచ్చి హాస్పిటల్ కు వచ్చాడని చెప్పారు. అందరికీ ఫ్లూ టెస్ట్ లు చేయగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని దీంతో అనుమానించి వీరి లక్షణాలతో ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందించానన్నారు.

కరోనా తొలి కేసులవుతాయని ఊహించలేదు
ఈ నలుగురే రిపోర్ట్ లే ప్రపంచాన్ని భయపెట్టే కరోనా తొలి కేసులు అవుతాయని ఊహించలేదని డాక్టర్ జంగ్ అన్నారు. కొత్త తరహా అంటు వ్యాధి అని భావించి ఆ నలుగురిని ప్రత్యేక వార్డులో ఉంచి ప్రత్యేకంగా రక్షణాలు పాటిస్తూ ట్రీట్ మెంట్ ఇచ్చామన్నారు. డాక్టర్ జంగ్ నివేదిక ఆధారంగా వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషనర్ డిసెంబర్ 30 న జనాన్ని అలర్ట్ చేశారు. ప్రమాదకరమైన వైరస్ విస్తరిస్తోందంటూ సిటిలో నోటీస్ జారీ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆ తర్వాత నాలుగు నెలల కాలంలోనే కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించింది. 2003 లో సార్స్ కేసులను కూడాట్రీట్ చేసిన అనుభవం 54 ఏళ్ల డాక్టర్ జంగ్ కు ఉంది. ఆ అనుభవంతోనే కొత్త లక్షణాలున్న వైరస్ విషయంలో అలర్ట్ గా వ్యవహారించారు. వీలైనంత త్వరగా కరోనా నుంచి ప్రపంచం బయటపడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.