వాషింగ్టన్: ఇరాన్‌పై సైనిక దాడులను రద్దు చేస్తూ, టెహ్రాన్‌తో ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆశ్చర్యానికి గురిచేసింది. ఇరాన్‌పై సైనిక చర్యను అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌గా ప్రారంభించినప్పటికీ, ఈ కీలక పరిణామంపై నెతన్యాహుకు ముందస్తు సమాచారం లేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అయితే, ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించే ముందు నెతన్యాహుకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని యూఎస్ వార్తా సంస్థ ‘అక్సియోస్’ తెలిపింది. ఆ తర్వాత ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడగా.. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోయినప్పటికీ, ఇరాన్ అణు ఇంధన తొలగింపు, క్షిపణి ఉత్పత్తిపై పరిమితులు, ఉగ్రవాద ప్రాక్సీలకు మద్దతు నిలిపివేత వంటి అంశాలు తుది ఒప్పందంలో ఉండేలా చూస్తానన్న ట్రంప్ హామీని నెతన్యాహు అభినందించారు.
