మస్క్ సంపద వంద లక్షల కోట్లు.. మొదటి ట్రిలియనీర్గా అవతరణ

మస్క్ సంపద వంద లక్షల కోట్లు.. మొదటి ట్రిలియనీర్గా అవతరణ
  • 11 శాతం లాభంతో 150 డాలర్ల దగ్గర లిస్టయిన స్పేస్‌‌‌‌ఎక్స్ షేర్లు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌‌‌‌ మరింత సంపన్నుడిగా ఎదిగారు. తన కంపెనీ స్పేస్‌‌‌‌ఎక్స్‌‌‌‌  మార్కెట్‌‌‌‌లో సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా లిస్ట్ కావడంతో ఆయన సంపద ఏకంగా 1.05 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.100 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఈ రాకెట్ కంపెనీ షేర్లు ఐపీఓలో షేరుకి 135 డాలర్ల దగ్గర అందుబాటులోకి రాగా, శుక్రవారం ఇష్యూ ధర కంటే 11 శాతం ఎక్కువకు అంటే 150 డాలర్ల దగ్గర మార్కెట్‌‌‌‌లో లిస్ట్ అయ్యాయి.  

కంపెనీ మొత్తం వాల్యుయేషన్ 2 ట్రిలియన్ డాలర్లను ఈజీగా దాటేసింది. స్పేస్‌‌‌‌ఎక్స్ ఐపీఓకి  రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ 
కనిపించింది.  ఐపీఓ ద్వారా 75 బిలియన్ డాలర్లను కంపెనీ సేకరించింది. సోలార్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను దాటి మిమ్మల్ని తీసుకెళ్లడమే తమ టార్గెట్ అని లిస్టింగ్ సందర్భంగా మస్క్ అన్నారు. కాగా,   స్పేస్‌‌‌‌ఎక్స్ రెవెన్యూలో 70 శాతం  సబ్సిడరీ స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ నుంచి వస్తోంది. ఈ కంపెనీలో సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌, ఏఐ కంపెనీ ఎక్స్‌‌‌‌ఏఐ ఇప్పటికే విలీనమయ్యాయి.

  • రాకెట్ స్పీడ్‌‌లో మస్క్ సంపద జూమ్‌‌‌‌..

స్పేస్‌‌‌‌ఎక్స్‌‌లో మస్క్ వాటా (42 శాతం) విలువ ఐపీఓకి ముందు  766 బిలియన్ డాలర్లు ఉండగా, ఐపీఓ తర్వాత మరో 180 బిలియన్ డాలర్లు పెరిగింది. మస్క్‌‌‌‌కు ఈవీ కంపెనీ టెస్లాలో 12 శాతం వాటా ఉండగా, దీని విలువ 280 బిలియన్ డాలర్ల దగ్గర ఉంది. ప్రస్తుతం మస్క్ సంపద ఏకంగా 20 దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. ఆయన సంపద 2012లోని 2 బిలియన్ డాలర్ల నుంచి 2020 నాటికి 75 బిలియన్ డాలర్లకు, ప్రస్తుతం ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.