వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆరోపించారు. ‘‘హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారతీయ నౌకలపై గురువారం రాత్రి వారు చేసిన డ్రోన్ దాడిని తిప్పికొట్టారు. ఈ దాడి యత్నం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ఉన్న 3 ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. దీంతో ఏ నౌకలను ఉద్దేశించి మాట్లాడుతున్నారో ట్రంప్ పేర్కొనలేదు.
