ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై రేవంత్‌కు డాక్టర్ల కృతజ్ఞతలు

ఉస్మానియా హాస్పిటల్  నిర్మాణంపై రేవంత్‌కు డాక్టర్ల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్  నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డాక్టర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నో ఏండ్లుగా కొత్త హాస్పిటల్‌ నిర్మాణం కోసం తాము, ప్రజలు చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చినందుకు సీఎం రేవంత్‌కు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు కృతజ్ఞతలు తెలుపుతూ పలు సంఘాల డాక్టర్లు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 

గత ప్రభుత్వం ఎన్నో ఏండ్ల పాటు ఊరించి, చివరకు కోర్టు కేసులను సాకుగా చూపి బిల్డింగ్‌ను నిర్మించలేదని తెలంగాణ గవర్నమెంట్  డాక్టర్స్  అసోసియేషన్‌ (టీజీడీఏ) ప్రతినిధులు పేర్కొన్నారు.