కరోనాకు సొంత ట్రీట్ మెంట్ డేంజర్

కరోనాకు సొంత ట్రీట్ మెంట్ డేంజర్
  • నెట్లో చూసి గోలీలు వేసుకుంటున్న పేషెంట్ లు
  • డాక్టర్ల సూచన లేకుండానే కార్టికో స్టెరాయిడ్స్ వాడుతున్న జనం
  • సైడ్ ఎఫెక్ట్స్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్న డాక్టర్లు
  •  ఇమ్యునిటీ పవర్‌‌‌‌ తగ్గి.. వైరస్ తీవ్రత పెరిగే ప్రమాదం
  • భవిష్యత్తులో గుండె, ఇతర ఆర్గాన్స్పైనా ఎఫెక్ట్..
  •  ఇష్ట మొచ్చినట్టు మెడిసిన్స్ రాస్తున్న కొందరు డాక్టర్లు
  •  అవగాహన లేకపోవడమే కారణమంటున్న ఎక్స్పర్టులు

కరోనా పేషెంట్లుకొందరు.. ముందు జాగ్రత్త కోసమంటూ ఇంకొందరు గూగుల్లో, సోషల్ మీడియాలో చూసి గోలీలు వేసుకుంటున్నారు. డాక్టర్లను  కన్సల్ట్ చేయకుండానే.. లక్షణాలతో సంబంధం లేకుండానే ప్రచారంలో ఉన్న అన్ని మందులనూ వాడేస్తున్నరు. జ్వరం, దగ్గు, జలుబుకు వాడే మందులతో పాటుయాంటీ బయాటిక్స్ను, డెక్సా మిథసోన్ వంటి కార్టికో స్టెరాయిడ్స్‌‌ను కూడా ఇష్టమొచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని.. వాటి వాడకం వల్ల ఇమ్యునిటీ పవర్‌‌ తగ్గుతుందని, వైరస్ ఎఫెక్ పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆక్సిజన్ లెవల్స్‌‌ పడిపోయిన స్థితిలో, సీరియస్ పేషెంట్లలో మాత్రమే కార్టికో స్టెరాయిడ్స్‌‌ అవసరం ఉంటుందని.. మామూలు వాళ్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్స్ ట్ తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇలా డాకర్ట్లను సంప్రదించకుండా మెడిసిన్స్ వేసుకుంటూ నిరక్ష్యం చేస్తుండటంతో లంగ్స్, ఇతర ఆర్గాన్స్పై వైరస్ ఎఫెక్ట్ పెరిగిపోతోందని అంటున్నా రు. ఇన్ఫెక్షన్స్ ముదిరాక హాస్పిటళ్లకు  స్తుండటంతో ట్రీట్మెంట్ కూడా కష్టంగా మారుతోందని డాక్టర్లు చెప్తున్నారు. కొందరిలో ఇప్పటికిప్పుడే వీటి ఎఫెక్ట్ తెలియకపోయినా.. భవిష్యత్‌లో విపరీతమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌  ముప్పు తప్పదని అంటున్నారు. సొంతంగా ఇష్టమొచ్చిన మెడిసిన్ వాడటం ఆపేయాలని సూచిస్తున్నారు.

 ప్రాణాలకూ ముప్పు వస్తది

కరోనా పేషెంట్లకు ఏ మందులు వాడాలో మొదట్లో డాక్టర్లకు  అర్థంకాలేదు. ఇప్పుడిప్పుడే కొంత అవగా హనకు వస్తున్నారు. మన దగ్గర పాజిటివ్ కేసులు ప్రారంభమైన తర్వాత హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమై సిన్‌, విటమిన్ ట్యాబ్లెట్లు, పారాసిటమాల్ ట్రీట్మెంట్ కోసం పనిచేస్తున్నాయని విపరీత మైన ప్రచారం జరిగింది. దాంతో చాలా మంది వైరస్ రాకముందే ఈ ట్యాబ్లెట్లు కొని వేసుకున్నారు. ఇప్పటికీ విపరీతంగా వాడుతున్నారు. తర్వాత డెక్సామిథసోన్, ఫావిపిరవిర్‌‌, ఫ్లాబిఫ్లూవంటివి కరోనాపై ప్రభావ వంతంగా పనిచేస్తున్నాయని ప్రచారం మొదలైంది. చాలా మంది వీటిని కూడా ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారని డాక్ట ర్లు చెప్తున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లతో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ డెక్సామిథసోన్ వంటి కార్టికోర్టి స్టెరాయిడ్స్‌ ఇష్టారీతిన వాడితే.. గుండె, ఇతర ఆర్గాన్‌లకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, హైబీపీ, ఎముకలు బలహీనపడటం, మజిల్స్‌ వీక్‌గా మారడం, కంటి చూపు దెబ్బతినడం, అల్సర్‌‌వంటి సమస్యలు వస్తాయన్నారు. కొందరి విషయంలో ప్రాణాలకూ ప్రమాదం వచ్చే చాన్స్ ఉందని సీనియర్ ఎండోక్రినాలజిస్ట్‌ డాకర్ రవిశంకర్‌‌ హెచ్చరించారు.

 డాక్టర్లు కూడా పొరపడుతున్నరు

కరోనా ట్రీట్‌మెంట్ విషయంలో రాష్ట్రం మొత్తం ఒకటే ప్రోటోకాల్ ఉంటుందని హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు పలుమార్లు ప్రకటించారు. కానీ ఫీల్డ్‌ లెవల్లోమాత్రం ఇప్పటికీ డాక్టర్లకు ఒక అవగాహన లేదు. సింప్టమ్స్‌ ఉన్నోళ్లకు, లేని వాళ్లకు ఒకే రకమైన మందులు ఇచ్చి హోమ్‌ ఐసోలేషన్‌కు పంపుతున్నారు. అసింప్టమాటిక్‌, మైల్డ్‌సింప్టమా టిక్ పేషెంట్లకు కూడా డెక్సామిథ సోన్, ఎకోస్ర్పిన్ వంటి ట్యాబ్లెట్స్‌ ఇస్తున్నారు. మైల్డ్ సింప్టమాటిక్ ఉన్న వాళ్లకు డెక్సామిథసోన్ అవసరం లేదని సీనియర్‌ ‌డాక్టర్లు చెప్తున్నారు. ఆక్సిజన్ లెవల్స్‌ పడిపోయిన పేషెంట్లకే ఇలాంటి కార్టికో  స్టెరాయిడ్ మందులు ఇవ్వాల్సి ఉంటుందని సీనియర్ డాక్టర్‌, క్రిటికల్ కేర్‌‌ఎక్స్‌పర్ట్‌కిరణ్‌ మాదాల వివరించారు. అసింప్టమా టిక్ పేషెంట్లకు ఎకోస్ర్పిన్ కూడా అవసరం లేదన్నారు. వైరస్ సింప్టమ్స్‌ ఉన్నవాళలో ్ల లంగ్స్‌లో బ్ల డ్‌ క్లాట్స్‌ ఏర్పడుతున్నందున, రక్తాన్ని పల్చగా చేసేందుకు ఈ మెడిసిన్ వాడుతున్నట్టువివరించారు. అది కూడా వైరస్ సింప్టమ్స్‌ప్రారంభమైన ఐదో రోజు తర్వాతే ఎకోస్ర్పిన్ వాడాలని.. అది కూడ తక్కువ డోస్‌ ట్యాబ్లెట్‌ , వారానికి ఒకటే వేసుకోవాలని చెప్పారు.