మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా? ఇలా చేయండి.. జెట్ స్పీడ్తో పనిచేస్తుంది

మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా? ఇలా చేయండి.. జెట్ స్పీడ్తో పనిచేస్తుంది

ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ లేకుండా ఏపని జరగదు. మనం కావాల్సిన వన్నీ ఫోన్లతో సేవ్ చేసుకుంటుంటాం. అందుకే సెల్ ఫోన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఫోన్ లో చిన్నపాటి సమస్య వచ్చినా.. ఫోన్ పనిచేయకపోయినా గుండె ఆగినంత పని అవుతుంది. ముఖ్యంగా ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా ఫ్రీజ్ అయినప్పుడల్లా ఏం చేయాలో అర్థం కాదు. చాలామంది ఇలాంటి సమస్యల్లో చిక్కుకుని ఇబ్బంది పడ్డవారే. అయితే దీనికి ఓ పరిష్కారం ఉంది. అదేంటో తెలుసుకుందాం.. 

చాలాసార్లు ఫోన్ ఉన్న ఏర్పడిన పెద్ద పెద్ద సమస్యలను కూడా కేవలం ఒక్క రీస్టార్ట్ తో పరిష్కరించవచ్చు. సో.. మీ ఫోన్ స్క్రీన్ ఫ్రీజింగ్ లేదా హ్యాకింగ్ సమస్య కాకుంటే రీస్టార్ట్ చేయడం ద్వారా దీని పరిష్కరించే అవకాశం ఉంది. 

ఫోన్ ను ట్రబుల్ షూట్ చేయండి అని గూగుల్ తన సపోర్ట్ పేజీలో చెప్పినట్లయితే మీరు ముందుగా ఆండ్రాయిడ్ ని అప్ డేట్ ని చూడాలి.అంటే సాఫ్ట్ వేర్ అప్ డేట్ మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేయబడలేదు అన్నమాట. దీంతో ఫోన్ లో హ్యాంగ్ అయ్యే సమస్య మొదలవుతుంది. అప్ డేట్ చేసుకుంటే స్పీడప్ అవుతంది. రెండో విషయం ఏమిటంటే.. హ్యాంగ్ అవుతుందంటే.. మీ స్టోరేజ్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలి.

యాప్ అప్డేట్లు: ఫోన్ లోని అన్ని పనులు యాప్ ల సహాయంతో మాత్రమే జరుగుతాయి. కాబట్టి యాప్ అప్ డేట్ లను తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యం. యాప్ అప్ డేట్ కాకపోయినా చాలా సార్లు హ్యాంగింగ్  సమస్య వస్తుంది. ఉపయోగించని యాప్ ను డెలిట్ చేయడంతోపాటు, బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్న యాప్ ను కూడా తొలిగించాలి. 

ఇవన్నీ ప్రయత్నించిన తర్వాత కూడా పని చేయకపోతే ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయవలసి ఉంటుంది. సమస్య ఇంకా కొనసాగుందని అనిపిస్తే సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్ళడం మంచిది.