బాలుడిపై కుక్క దాడి

బాలుడిపై కుక్క దాడి

శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రానికి చెందిన అక్షిత్​(3) అనే బాలుడు సోమవారం వాకిట్లో ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. బాలుడి కేకలు విని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చి కుక్కను వెళ్లగొట్టారు. కాగా అక్షిత్​ ముఖంపై బలమైన గాయం కావడంతో నర్సాపూర్ గవర్నమెంట్​హాస్పిటల్​ తీసుకెళ్లి ట్రీట్మెంట్​చేయించారు.