కుక్కల దాడిలో గర్భిణీకి తీవ్ర గాయాలు

కుక్కల దాడిలో గర్భిణీకి తీవ్ర గాయాలు

రాష్ట్రంలో కుక్కల దాడులు కలవర పెడుతున్నాయి.  రోజు ఏదో ఒక చోట మనుషులపై దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు బలయ్యారు. పలు చోట్ల చాలా మంది గాయాలపాలయ్యారు.

 లేటెస్ట్ గా  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లిలో కుక్కల స్వైర విహారం చేశాయి.  కుక్కల దాడిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఒక గర్భిణీ ఉన్నారు.  క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. కుక్కల దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  కుక్కల నియంత్రనకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.