తెలంగాణ శాసనమండలికి ఏఐసీసీ కార్యదర్శి హారతి కృష్ణ

తెలంగాణ శాసనమండలికి ఏఐసీసీ కార్యదర్శి హారతి కృష్ణ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ శాసనమండలి వద్ద ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ కార్యదర్శి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ)  ఇన్ చార్జ్ డా.హారతి కృష్ణ శుక్రవారం రాష్ట్ర కౌన్సిల్​ను  సందర్శించారు. కర్నాటక ఎమ్మెల్సీగా కూడా వ్యవహరిస్తున్న ఆమెను.. మండలికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. 

వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా హారతి కృష్ణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలతో పాటు, ప్రవాస భారతీయులు, గల్ఫ్​ కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై హారతి కృష్ణతో నేతలు కాసేపు చర్చించారు.