- ఎనిమిదేండ్ల బాలుడికి తీవ్ర గాయాలు
అంబర్ పేట, వెలుగు: మూసీ నది ఒడ్డున పతంగులు ఎగరేస్తుండగా, ఎనిమిదేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. హైదరాబాద్ అంబర్పేట్ సీపీఎల్ రోడ్ పరిధిలోని అన్నపూర్ణ నగర్‌కు చెందిన మల్లేశ్ కొడుకు రుత్విక్(8) భాష్యం మోడల్ స్కూల్లో చదువుతున్నాడు. శనివారం మూసీ నది ఒడ్డున పతంగులు ఎగరేస్తుండగా ఒక్కసారిగా ఐదు కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడి కాలు, కడుపు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు తొలుత ఫీవర్ హాస్పిటల్‌కు తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం బాలుడికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది.
