భారీగా పతనమైన దేశీయ మార్కెట్ సూచీలు

భారీగా పతనమైన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. 950 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా... 250 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతుంది నిఫ్టీ. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. దీని ప్రభావం దేశీయ సూచీలపై పడింది. తోడు మార్కెట్ తీరు అంచనావేసే విక్స్ సూచీ 9 శాతం పెరగడం ఇన్వెస్టర్లను ప్రోత్సహించింది. ఐరోపా ఖండంలోని ఫైనాన్షియల్ హబ్ అయిన యూకేలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల అత్యధికానికి పెరిగింది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుకు కారణమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.
 

మరిన్ని వార్తల కోసం...

వరద గుప్పిట్లో అస్సాం

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది