అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ భార్య లారా సోమవారం అర్ధరాత్రి దాటాక ఓ అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎరిక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ చిన్నారికి కరోలినా డోరోతి అని పేరు పెట్టారు. ఎరిక్ దంపతులకు ఇది రెండో సంతానం. 73 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యల ద్వారా ఐదుగురు సంతానం. వీరిలో మొదటి ఇద్దరు డొనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్. మూడో సంతానం ఎరిక్. ట్రంప్ ఆర్గనైజేషన్‌లో తన సోదరుడు డొనాల్డ్ జూనియర్‌తో కలిసి ఎరిక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. 36 ఏళ్ల లారా ట్రంప్ మాజీ జర్నలిస్ట్.
