డొనాల్డ్ ట్రంప్‌కు 10 వేల డాలర్లు ఫైన్

డొనాల్డ్ ట్రంప్‌కు 10 వేల డాలర్లు ఫైన్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు 10 వేల డాలర్ల(రూ.8 లక్షలు) ఫైన్ విధించింది. కోర్టు సిబ్బందిపై అనుచిత కామెంట్లు చేసినందుకు ఈ జరిమానా వేస్తున్నట్లు జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ వెల్లడించారు. కోర్టు సిబ్బందిపై బహిరంగంగా కామెంట్లు చేయవద్దని కొన్ని వారాల క్రిందటే ట్రంప్‌కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. 

కోర్టు ఉత్తర్వులను ట్రంప్ ఉల్లంఘించినందునే ఫైన్ వేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలను పునరావృతం చేయవద్దని.. ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. దీనిపై ట్రంప్  లాయర్ స్పందిస్తూ..తన క్లయింట్ ఓ సాక్షిని ఉద్దేశించి మాత్రమే కామెంట్లు చేశారని, కోర్టు సిబ్బందిని ఏమీ అనలేదన్నారు.