మగ్ షాట్ : జేబులు కొట్టేవాడిని ట్రీట్ చేసినట్లు.. జైల్లో ట్రంప్ ఫొటో తీశారా..!

మగ్ షాట్ : జేబులు కొట్టేవాడిని ట్రీట్ చేసినట్లు.. జైల్లో ట్రంప్ ఫొటో తీశారా..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఘోర అవమానం జరిగింది. ఆగస్టు 25వ తేదీన ట్రంప్ను అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు..ఆయన్ను..అతి దారణంగా ట్రీట్ చేశారు. జేబులు కొట్టేవాడి కంటే దారుణంగా ఆయన్ను ట్రీట్ చేశారు. అంతేకాదు..చోరీలు చేసే వారు, ఇతర నేరగాళ్లను పరిగణించినట్లు ట్రంప్ను అమెరికా పోలీసులు పరిగణించారు. 

మరి ఇంత దారుణంగానా..?

2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిల సమయంలో జార్జియా రాష్ట్ర ఫలితాలను ట్రంప్  తారుమారు చేసేందుకు యత్నించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 25వ తేదీన   డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు.  జార్జియా రాష్ట్ర ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదు కావడంతో ట్రంప్ జార్జియా జైల్‌ వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనే  స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. అనంతరం  2 లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించారు. దీంతో బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు. ఈ మొత్తం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. ఈ సమయంలో  ట్రంప్ను అక్కడి జైలు అధికారులు మగ్ షాట్ ఫోటో తీశారు.  క్రిమినల్ ను తీసినట్లు ఫోటో తీయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 

చాలా కోపంగా..

మగ్ షాట్ ఫోటోలో  ట్రంప్ కోపంగా, ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపించింది. ఫోటో లైటింగ్లో జుట్టు మెరిసిపోతుంది. ముఖ్యంగా కళ్లల్లో విపరీతమైన కోపం కనిపించింది. విసుగుగా ఉన్నట్లు ముఖం ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఫోటో వైరల్ అయింది. 

 రామ్ గోపాల్ వర్మ  ట్వీట్..

డొనాల్డ్ ట్రంప్ మగ్ షాట్ ఫోటో, ఆయన అరెస్ట్ కావడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిపై అభియోగాలు మోపడం, ఆయన్ను మగ్ షాట్ తీయడం అనేది నిజంగా పారదర్శక పాలనకు నిదర్శనమని చెప్పాడు. అమెరికాలో ఎవరూ కూడా రాజులు లేరని..అక్కడి న్యాయస్థానమే రాజు అని ట్వీట్ చేశాడు. 

మగ్ షాట్ ఫోటో అంటే..

"మగ్" అంటే  " ముఖం " అని అర్థం. ఇది  ఆంగ్ల యాస పదం .  ఈ పదం 18వ శతాబ్దానికి చెందినది. మగ్ షాట్ ఫోటో అంటే నేరగాడిని పోలీసులు తీసే ఫోటో.  ఎవరైనా వ్యక్తి నేరం చేస్తే పోలీసులు అతన్ని మగ్ షాట్ ఫోటో తీస్తారు. రికార్డుల్లో లేదా..స్టేషన్ బోర్డులో పెట్టేందుకు మగ్ షాట్ ఫోటో తీస్తారు. దీని ఉద్దేశం నేరం చేసిన వ్యక్తిని బాధితులు, లేదా ప్రజలు గుర్తించడం కోసం ఈ ఫోటో తీసి రికార్డుల్లో పెడతారు. 

మగ్ షాట్ను ఎలా తీస్తారు...ఎప్పటి నుంచి తీస్తున్నారు..

మగ్ షాట్ ఫోటోను నేరస్తుడి  రెండు వైపులా తీస్తుంటారు.  ఒక వైపు ముఖానికి సంబంధించిన ఫోటో ఉంటుంది. మరోవైపు కుడివైపు గానీ..లేదా ఎడమవైపు గానీ చూస్తున్నట్లు ఉంటుంది.  నేరస్థుడిని గుర్తించడానికి మగ్ షాట్‌లను మగ్ పుస్తకంలో పెట్టొచ్చు. మగ్ షాట్ ఫోటోను ఫోటోగ్రఫీని కనుగొన్న కొద్ది సంవత్సరాల తర్వాత అంటే 1840 లలో ఈ విధంగా  ఫోటో తీయడం ప్రారంభమైంది.  1888 వరకు ఫ్రెంచ్ పోలీసు అధికారి అల్ఫోన్స్ బెర్టిల్లాన్ ఈ ప్రక్రియను అనుసరించాడు.