చైనీస్ వైరస్ అంటారా?.. ట్రంప్‌పై పరువు నష్టం దావా

చైనీస్ వైరస్ అంటారా?.. ట్రంప్‌పై పరువు నష్టం దావా

వాషింగ్టన్ డీసీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ గా పిలిచిన సంగతి తెలిసింది. తాజాగా ఈ అంశం మళ్లీ తెర పైకి వచ్చింది. ట్రంప్ ఇలా అనడాన్ని నిరసిస్తూ.. చైనీస్ అమెరికన్ సివిల్ రైట్స్ కొలిజన్ (సీఏసీఆర్సీ) ఆయన మీద ఫెడరల్ కోర్టులో దావా వేసింది. కరోనా వైరస్ కు ఏది పుట్టుక అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, అయినా చైనాలోనే కొవిడ్ పుట్టిందని ట్రంప్ చేసిన ఆరోపణలు నిరాధారమని సీఏసీఆర్సీ మండిపడింది. ఈ వ్యాఖ్యల వల్ల తమ కమ్యూనిటీకి చాలా హాని కలిగిందని పేర్కొంది. ఇందుకు గాను పరువు నష్టం కింద అమెరికాలో ఉంటున్న ప్రతి ఏషియన్ అమెరికన్, పసిఫిక్ ఐలాండర్లకు ఒక్కో డాలర్ చొప్పున మొత్తంగా 22.9 మిలియన్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.