కార్లు, ఫ్రిడ్జ్‌‌లను కొనొద్దు : జెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెజోస్‌‌‌‌‌‌‌‌

కార్లు, ఫ్రిడ్జ్‌‌లను కొనొద్దు : జెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెజోస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిలీ: యూఎస్ ఆర్థిక వ్యవస్థ రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకుంటుండడంతో  ఖర్చులు ఎలా చేయాలో అక్కడి  కన్జూమర్లకు అమెజాన్ ఫౌండర్​ జెఫ్ బెజోస్ కొన్ని సలహాలిచ్చారు.  క్రిస్మస్ సీజన్ దగ్గరకు వస్తుండడంతో  అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని అన్నారు.

 రిఫ్రిజిరేటర్లు, కార్లు వంటి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను కొనొద్దని సూచించారు.  ‘మీరొక పెద్ద స్క్రీన్ టీవీని కొనాలని చూస్తుంటే, కొద్దిగా ఆగండి,  ఆ డబ్బులను సేవ్ చేసుకోండి. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రిఫ్రిజిరేటర్లు, కొత్త కార్ల విషయంలోనూ ఇదే పాటించండి’ అని అన్నారు.