అయోధ్య వచ్చి పాపం చేయొద్దు.. మీరిద్దరు హజ్ యాత్రకు వెళ్లండి

అయోధ్య వచ్చి పాపం చేయొద్దు.. మీరిద్దరు హజ్ యాత్రకు వెళ్లండి

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రామ జన్మభూమి అయోధ్యలో పర్యటిస్తానని ప్రకటన చేసిన నాటి నుంచి బీజేపీ, శివసేన మధ్య మాటల వార్ నడుస్తోంది. తొలుత ఆయన అయోధ్యకు వస్తే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా వెంటబెట్టుకుని రావాలంటూ చాలెంజ్ విసిరారు బీజేపీ నేతలు. అయితే దీనిపై నిన్న స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. బీజేపీ నేతలు గతంలో పొత్తు పెట్టుకున్న కశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీని అయోధ్య తీసుకురాగలరా అంటూ ఎదురు ప్రశ్నించారు. దీనికి తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కౌంటర్ వేశారు. ఉద్ధవ్ థాక్రే అయోధ్యకు కాకుండా రాహుల్ గాంధీతో కలిసి హజ్ యాత్రకు టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన నడుపుతున్న రాజకీయాల తీరుకు అదే కరెక్ట్‌గా సూట్ అవుతుందని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఉద్ధవ్ థాక్రే, రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో సీఎంగా కొనసాగుతున్నారని అన్నారు.

అయోధ్య సందర్శనతో ఉద్ధవ్ థాక్రే పాపానికి ఒడిగడుతున్నారని అన్నారు జీవీఎల్. ఆయన పర్యటనతో ఎవరికీ ఒరిగేదేమీలేదన్నారు. దీనికి బదులు రాహుల్ గాంధీతో కలిసి వారికి నచ్చిన ప్రదేశానికి వెళ్లడం మేలని చెప్పారు. బాల్ థాక్రేలాగా హిందుత్వ రాజకీయాలకు ప్రతీకగా చెప్పుకునే హక్కును ఉద్ధవ్ కోల్పోయారని అన్నారాయన. కొన్ని వారాల క్రితం ముందు ఉన్న శివసేన పార్టీ వేరని చెప్పారు జీవీఎల్.