మూగజీవాలను బాధించొద్దు

మూగజీవాలను బాధించొద్దు

దీపావళి రోజు పటాకులు మనకు ఎంజాయ్ మెంట్ ఇచ్చినా..పక్షులు, జంతువులకు ఈ శబ్ధాలు ఇబ్బంది కలిగిస్తాయని యానిమల్ లవర్స్ అంటున్నారు. జంతువులు, పక్షుల కోసం ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. పెద్ద శబ్దాలు, మెరుస్తున్న లైట్లకి పెం పుడు
జంతువులు బెదిరిపోతాయి. ఈ శబ్ధాలకు అవి ఇంట్లో నుంచి బయటికెళితే తప్పిపోయే ప్రమాదం ఉంది. పెంపుడు జంతువుల దగ్గర పటాకులను
నిల్వ ఉంచొద్దు. చెట్లకింద చిచ్చుబుడ్లు, రాకెట్లు పేల్చొద్దు. చెట్లపై ఉండే పక్షులు గాయపడే అవకాశముంది.

పటాకులు పేల్చడం వల్ల గాయపడిన పక్షులకు నీళ్లు ఇవ్వకూడదు. ఫారెస్ట్ అధికారులు లేదా వైల్డ్ లైఫ్ సంస్థల నిర్వాహకులను సంప్రదించాలి. పెద్ద శబ్ధాలకు జంతువులు భయపడుతున్నట్టుగా అనిపిస్తే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఎవరైనా వీధికుక్కలు, ఇతర మూగజీవాలపై ఉద్దేశపూర్వకంగా క్రాకర్స్ విసరడం..వాటిని బాధించడం చేసినట్టు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.