
వెంకటాపూర్( రామప్ప) వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను ఈ నెల14న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనుండగా విద్యుత్ ఏర్పాట్లపై ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీదారులు వస్తుండగా.. క్షణం కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. హరిత హోటల్, ఇంటర్పిటేషన్ సెంటర్ వద్ద ట్రాన్స్ ఫార్మర్లరు తనిఖీ చేశారు. ఆయన వెంట డీఈ టెక్నికల్ సంపత్, ములుగు డీఈ ఆపరేషన్ నాగేశ్వరరావు, భూపాలపల్లి డీఈ టెక్నికల్ వెంకటేశ్వర్లు, విద్యుత్ ఏఈ లు, సిబ్బంది ఉన్నారు.