బుద్వేల్​లో ప్రభుత్వ భూములు అమ్మొద్దు : బీజేపీ నేతలు

బుద్వేల్​లో ప్రభుత్వ భూములు అమ్మొద్దు : బీజేపీ నేతలు

గండిపేట/ శంషాబాద్: వెలుగు: బుద్వేల్ భూములను అమ్మొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బుద్వేల్‌‌‌‌లోని ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలను పోలీసులు మానసహిల్స్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు తరలించారు. అనంతరం బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడాల్సిన భూములను ప్రభుత్వం అమ్ముకొని సొమ్ము చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. 

గతంలో ప్రభుత్వ భూములను అమ్మవద్దని నిరసనలు, ర్యాలీలు చేపట్టినోళ్లే.. ఇయ్యాల భూములను అమ్ముతున్నరని విమర్శించారు. మొన్న కోకాపేట భూములు, ఇప్పుడు బుద్వేల్ భూములు అమ్ముతున్న ప్రభుత్వం.. రేపు మన భూములను కూడా అమ్ముతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క వేణుగోపాల్ అన్నారు. కార్యక్రమంలో టి.వీరేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌, అత్తాపూర్‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ సంగీత, మల్లేశ్ యాదవ్, డాక్టర్​ ప్రేమ్‌‌‌‌రాజ్‌‌‌‌ యాదవ్, టి.అంజన్‌‌‌‌కుమార్‌‌‌‌గౌడ్, వై.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

వెయ్యి కోట్ల భూమి 33 కోట్లకు కేటాయిస్తరా?

బుద్వేల్​లోని ప్రభుత్వ భూమి వద్ద నిరసన తెలిపేందుకు బయల్దేరిన శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లికి చెందిన బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. తర్వాత మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కాటేదాన్​ లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఓపక్క ఎకరం భూమి రూ.వెయ్యి కోట్లకు అమ్ముకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ సర్కార్ వారి పార్టీ ఆఫీసు కోసం మాత్రం చౌకగా భూమి కేటాయించుకుంది. ప్రస్తుత రేటు ప్రకారం రూ.1,100 కోట్ల విలువైన కోకాపేటలోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు కేవలం రూ.33 కోట్లకు కేటాయించడం ఏంటి?” అని ప్రశ్నించారు.