
- మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌స్కామ్, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఎవ్వరూ మాట్లాడొద్దని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్హైకమాండ్ఆదేశించింది. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌నుంచి పార్టీ నేతలకు ఈ మేరకు ఫోన్లు చేసి ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దని తేల్చిచెప్పారు. టీవీ చర్చల్లోనూ లిక్కర్‌స్కామ్‌పై ఎలాంటి కామెంట్లు చేయొద్దని స్పష్టం చేశారు.
కవిత అరెస్టుపై రెండు రోజుల క్రితం బీజేపీ స్టేట్చీఫ్బండి సంజయ్చేసిన వ్యాఖ్యలపైనే నిరసనలు, ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు చేయాలని ఆదేశించారు. ఈడీ విచారణ రాజకీయ కక్షసాధింపు చర్యే తప్ప లిక్కర్‌స్కామ్ అనేదే జరగలేదన్నట్టుగా కౌంటర్చేయాలని సూచించారు.