
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ గా తన బాధ్యతలను పూర్తిగా ఆస్వాదిస్తానని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెప్పాడు. అయితే సారథిగా పదవీకాలం ఎంతనే దాని గురిం చి పట్టించుకోనని వెల్లడించాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో పూర్తిస్థా యి బాధ్యతలు ఇస్తారా? లేదా? అన్న దానిపై కూడా తనకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు. ‘కెప్టెన్సీపై పెద్ద చర్చ అవసరం లేదు. టీమ్ పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు నేను బాధ్యతలు తీసుకో వడానికి సిద్ధంగా ఉంటా. అలా చేయడం నాకు సంతోషాన్నిస్తుంది. కెప్టెన్సీ అనేది నా చేతుల్లో లేదు. ఒక్క మ్యాచైనా, లేక 100 మ్యాచ్ ల్లో నైనా కెప్టెన్ గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తా ’ అని ఈ ముంబైకర్ వ్యాఖ్యానిం చాడు. బంగ్లాదేశ్ తో తొలి డేనైట్ టెస్ట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థా యికి చేరడంపై రోహిత్ స్పందిం చాడు. మ్యాచ్ సందర్భంగా పొల్యూషన్ కు సంబంధించిన సమస్యలు వస్తాయనుకోవడం లేదన్నాడు. షకీబ్ పై బ్యాన్ గురించి స్పందించేందుకు రోహిత్ ఇష్టపడలేదు.