ఎన్నికల ​హామీలకు ఎస్సీ, ఎస్టీ నిధులు వాడొద్దు: మాజీ సీఎం బొమ్మై

ఎన్నికల ​హామీలకు ఎస్సీ, ఎస్టీ నిధులు వాడొద్దు: మాజీ సీఎం బొమ్మై

బెంగళూరు: ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఎస్సీ ఎస్టీ సబ్​ ప్లాన్ నిధులు వాడడమంటే దళితులను మోసం చేయడమేనని కర్నాటక సర్కారుపై మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై విమర్శలు గుప్పించారు. ఐదు గ్యారెంటీ స్కీమ్​ల కోసం ఇప్పటికే విడుదల చేసిన నిధులను వెంటనే వాపస్ తీసుకోవాలని, లేదంటే ఎస్సీ, ఎస్టీల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈమేరకు శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడం పార్క్​లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో బొమ్మై మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఐదు గ్యారెంటీ స్కీమ్​ల అమలు కు ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధులు రూ.34,294 కోట్ల నుంచి రూ.11,144 కోట్లను ప్రభుత్వం మళ్లించిందని చెప్పారు. హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని మండిపడ్డారు.