బీ అలర్ట్ : రైళ్లో దీపావళి పటాకులు తీసుకెళితే జైలుకే

బీ అలర్ట్ : రైళ్లో దీపావళి పటాకులు తీసుకెళితే జైలుకే

దీపావళి పండుగకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  రైల్లో ప్రయాణించేటప్పుడు పేలుడు పదార్థాలు లేదా బాణసంచా తీసుకెళ్లవద్దని దక్షిణ మధ్య రైల్వే (SCR) సూచించింది. అలా చేయడం వల్ల ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. 

 ఒకవేళ ఎవరైనా వీటితో  పట్టుబడితే వారికి రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164 ,165 ప్రకారం రూ. 1000 వరకు జరిమానా లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష ..   తీవ్రతను బట్టి రెండూ కూడా విధించబడతాయని తెలిపింది.  

ఎవరైనా అనుమనాస్సద వస్తువులు,  పేలుడు పదార్థలు తీసుకెళ్లినట్లు అనిపిస్తే 139 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.