అటకెక్కించారు!.. పదేండ్లుగా అవినీతి అధికారులపై చర్యల్లేవ్

 అటకెక్కించారు!.. పదేండ్లుగా అవినీతి అధికారులపై చర్యల్లేవ్

హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కారు హయాంలో విజిలెన్సు నివేదికలు అటకెక్కాయి. అవినీతి అధికారులపై వచ్చిన రిపోర్టులను అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది. పదేండ్లలో 3,213 విజిలెన్స్ రిపోర్టులు అటకెక్కాయి. ఇందులో తీవ్ర ఆరోపణలకు సంబంధించిన 1230 నివేదికలు ఉనాయి. భారీ అవకతవకలకు సంబంధించి 768,  అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఇచ్చిన 1215 రిపోర్టులున్నా.. వాటిని పట్టించుకోలేదు. ఒక్క నివేదికపై చర్యలు తీసుకోలేదు. ఈ నివేదికల్లో ఒకదాని ఆధారంగా మైనింగ్ శాఖకు సంబంధించిన ఆరుగురిపై నిన్న సీఎం  రేవంత్ రెడ్డి వేటు వేశారు. వారిని మాతృశాఖకు బదిలీ చేశారు. మిగతా నివేదికలు పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. 

బయటపెట్టిన సీజీజీ

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి ఈ విజిలెన్స్ నివేదికల విషయాన్ని రట్టు చేశారు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా.. ఈ నిష్టుర సత్యం బయటపడింది. వీటి ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. గతంలో గవర్నర్, సీఎస్ దృష్టికి తీసుకెళ్లినా  పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో ఎక్కువ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి అధికారులకు సహకరించిన సెక్రటేరియట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

సీఎం సీరియస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి అధికారులపై కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేతికి విజిలెన్స్ నివేదికలు అందడంతో వాటి ఆధారంగా సమూల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆరుగురు మైనింగ్ శాఖ అధికారులపై వేటు వేశారు. మిగతా నివేదికల చిట్టా విప్పితే ఎవరెవరిపై ఎలాంటి చర్యలుంటాయోనన్నది ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బంద్ కానున్నాయి.   2024 మే 25 సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి అంటే మే 27 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికలు జరగని ప్రాంతంలో మాత్రం మద్యం దుకాణాలు తీసి ఉంటాయి.  ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు జూన్ 4వ తేదీన కూడా తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

 మే 27వ తేదీ మంగళవారం రోజున  జరిగే  పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు  చేశారు.  ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ రోజు ఉదయం6 నుండి సాయంత్రం 8 వరకు144 సెక్షన్ అమలు ఉంటుంది. ఇక మూడు జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.  మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మొత్తం 4 లక్షల 61 వేల 806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985 మంది  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా..  ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.