
హైదరాబాద్, వెలుగు: తమ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతుబంధు కన్నా.. ధాన్యానికి మద్దతు ధర పెంచడంతో రైతులకు ఎక్కువ లబ్ధి జరుగుతుందన్నారు. వరి మద్దతు ధర రూ. 3,100 పెంచడంతో ఎకరాకు రూ.45 వేల లబ్ధి జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన సోమాజిగూడలో బీజేపీ మీడియా సెంటర్లో మాట్లాడుతూ, కేంద్ర ఎరువుల సబ్సిడీతో పాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధితో రైతుకు అదనపు లాభమన్నారు.