- అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పాల్వంచలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మూడేండ్లలో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2వ తేదీన ప్రారంభించనున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు, పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పర్యటన ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు.
