స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా నవీన్ బాధ్యతల స్వీకరణ

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా నవీన్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​గా డాక్టర్ నవీన్ నికోలస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన తాజాగా బదిలీ అయ్యారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన నవీన్ నికోలస్ ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, పలు టీచర్ల సంఘాల నేతలు కలిసి అభినందనలు చెప్పారు.