పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖాన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి విశిష్ఠ మైలురాయిని అందుకున్నారు. రెండు దశాబ్దాల్లో 20 వేలకు పైగా పీటీసీఏ(స్టంట్) శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన ఆయన, వాటిలో 3 వేలకు పైగా రోగులను క్రమపద్ధతిలో ఫాలో-అప్ చేసిన అరుదైన రికార్డును సృష్టించారు.
ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. విశ్వాసం, ధైర్యంతో చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. గుండె ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో డాక్టర్ ప్రమోద్ ఫాలో -అప్ పద్ధతి విశేషమైందన్నారు. దేశంలోని 16 నగరాల్లో 24 దవాఖానలతో మెడికవర్ గ్రూప్ విస్తరించి ఉన్నదని చెప్పారు.
