బంజారాహిల్స్‌‌లోని కేర్ హాస్పిటల్స్‌‌లో .. 8 గంటల్లో 17 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు

బంజారాహిల్స్‌‌లోని కేర్ హాస్పిటల్స్‌‌లో .. 8 గంటల్లో 17 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్‌‌లోని కేర్ హాస్పిటల్స్‌‌లో అరుదైన ఘనత నమోదైంది. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజిబ్ కుమార్ బెహెరా ఒకే రోజు 17 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 గంటల వ్యవధిలో ఇవి పూర్తయ్యాయి. 

ఈ సందర్భంగా హాస్పిటల్స్‌‌ ఆర్థోపెడిక్ , జాయింట్ రీప్లేస్‌‌మెంట్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్, హెచ్‌‌ఓడీ డాక్టర్ సంజిబ్ కుమార్ బెహెరా మాట్లాడుతూ.. అన్ని విభాగాల సహకారంతో ఈ ఆపరేషన్లు సక్సెస్​ అయ్యాయని తెలిపారు.