- ఎల్వీ ప్రసాద్ డాక్టర్‌కు అరుదైన గుర్తింపు
- నోయెల్ రైస్ లెక్చర్ ఇచ్చిన శిరీషా
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల గ్లకోమా కేర్ విభాగం హెడ్ డాక్టర్ శిరీషా సెంథిల్‌కు ప్రతిష్టాత్మక ‘నోయెల్ రైస్ లెక్చర్’ గౌరవం దక్కింది. యూకే పీడియాట్రిక్ గ్లకోమా సొసైటీ ఆధ్వర్యంలో ఆమె ఈ లెక్చర్ ఇచ్చారు. 2012లో ఈ లెక్చర్ ప్రారంభం కాగా, ఈ గౌరవం పొందిన మూడో భారతీయురాలిగా నిలిచారు. ఈ లెక్చర్‌లో ఆమె పిల్లల గ్లకోమా చికిత్సలో ‘వ్యక్తిగత వైద్యం’ ప్రాముఖ్యత గురించి వివరించారు. అందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా, జన్యు నిర్మాణం, వ్యాధి తీవ్రత, కంటి ఆకృతి, సామాజిక నేపథ్యం ఆధారంగా చికిత్స చేయడం వల్ల ఫలితాలుంటాయన్నారు.
భవిష్యత్తులో ముందస్తు గుర్తింపు, దీర్ఘకాలిక చికిత్సలు, తక్కువ సర్జరీలతో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఇప్పటివరకు 179కి పైగా రీసెర్చ్పేపర్లు పబ్లిష్చేసిన డాక్టర్ శిరీషా..పిల్లల గ్లకోమాలో దీర్ఘకాలిక సంరక్షణ, ఓర్పు, వినయం ప్రాముఖ్యత గురించి యంగ్డాక్టర్లకు సలహాలు, సూచనలు చేశారు.
