35 ఏళ్ళ లోపు వయసు వారైతే.. మీకే ఈ ఛాన్స్: ఎస్ఎస్పీఎల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్

35 ఏళ్ళ లోపు వయసు వారైతే.. మీకే ఈ ఛాన్స్: ఎస్ఎస్పీఎల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్

భారత ప్రభుత్వ సంస్థ డీఆర్​డీఓ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ(ఎస్ఎస్​పీఎల్) రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 26.

పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ 06, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 14.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంఫిల్ లేదా పీహెచ్​డీ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: రీసెర్చ్ అసోసియేట్​కు గరిష్ట వయోపరిమితి35 ఏండ్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్​నకు 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: జూన్ 26. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు  hrd.sspl@gov.in వెబ్​సైట్​లోచూడగలరు. 

►ALSO READ | ఇంటర్ అర్హతతో హెచ్ఏఎల్లో టెక్నికల్ పోస్టులు... ఎగ్జామ్ మాత్రమే, ఇంటర్వ్యూ లేదు..