స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌‌లోకి డ్రీమ్ 11 పేరెంట్ కంపెనీ

స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌‌లోకి డ్రీమ్ 11 పేరెంట్ కంపెనీ

న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్‌‌ సర్వీస్‌‌లు అందించిన డ్రీమ్‌‌ 11 పేరెంట్‌‌ కంపెనీ డ్రీమ్‌‌ స్పోర్ట్స్‌‌  భారత స్టాక్ బ్రోకింగ్ రంగంలోకి డ్రీమ్‌‌ స్ట్రీట్‌‌ పేరుతో అడుగుపెడుతోంది.  ‘‘అవసరమైన అన్ని లైసెన్సులు పొందాం.  ప్రస్తుతం ప్లాట్‌‌ఫామ్‌‌ను  ఇంటర్నల్‌‌గా టెస్ట్‌‌ చేస్తున్నాం.  

త్వరలో పబ్లిక్‌‌ ముందుకు వస్తాం”అని  కంపెనీ సీఈఓ హర్ష్ జైన్   తెలిపారు.  ప్రధానంగా టియర్-2, టియర్-3 నగరాల పెట్టుబడిదారులను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.  ఇన్వెస్టర్లకు  ఏఐ ఆధారిత వ్యక్తిగత ఇన్వెస్టింగ్ టూల్స్ అందిస్తామని చెప్పారు.  “మార్కెట్‌‌లో 90శాతం మంది నష్టపోతున్నారు.  వారికి సహాయం చేసే వ్యక్తిగత పరిష్కారం లేదు. మేము ఏఐ ద్వారా గోల్డ్‌‌మన్ శాక్స్‌‌  లేదా జేపీ మోర్గాన్  స్థాయి విశ్లేషణను ప్రతి పెట్టుబడిదారుడికి అందుబాటులోకి తెస్తాం”అని  జైన్ పేర్కొన్నారు.  కాగా, డ్రీమ్‌‌ స్పోర్ట్స్  కిందటేడాది డ్రీమ్ మనీ  ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌లోకి ప్రవేశించింది. గోల్డ్, ఎఫ్‌‌డీలలో పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది.